శారీరక శ్రమతో మానసిక స్థితి మెరుగు

16-12-2018: కొంతమంది మానసిక స్థితి ఉన్నట్టుండి మారిపోతుంది. అప్పటివరకూ సంతోషంగా ఉన్న వారు.. వెంటనే ఏదో కోల్పోయిన వారిలా మారిపోతారు. శారీరక శ్రమతో ఇలాంటి వారి మానసిక స్థితి మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని జాన్స్‌ హోప్‌కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న 54 మంది రోజువారీ కార్యకలాపాలను ఒక ట్రాకర్‌ సాయంతో పర్యవేక్షించారు. వీరు రోజులో ఎక్కువ సమయం శారీరక శ్రమ చేయడం వల్ల మానసిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు.