కేన్సర్‌పై పోరాడే కాఫీ సమ్మేళనాలు!

19-03-2019: కాఫీలో ఉండే కహవోల్‌ యాక్సిటేట్‌, కేఫ్‌స్టాల్‌ అనే సమ్మేళనాలు ప్రొస్టేట్‌ కేన్సర్‌పై పోరాడతాయని జపాన్‌లోని కనజావా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు కాఫీలో లభ్యమయ్యే ఆరు సమ్మేళనాలను పరీక్షించారు. ప్రొస్టేట్‌ కేన్సర్‌ కణాలు ఎక్కించిన 16 ఎలుకలకు కహవోల్‌ యాక్సిటేట్‌, కేఫ్‌స్టాల్‌ అనే పదార్థాలు అందించారు. అవి ప్రొస్టేట్‌ కేన్సర్‌ కణాలపై పోరాడాయని, సాధారణ కేన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధించాయని తెలిపారు.