కొబ్బరినూనె విషంతో సమానం!

12-09-2018: ఇటీవలి కాలంలో ఓ నమ్మకం బాగా ప్రాచుర్యం పొందింది. అదేమింటే....కొబ్బరినూనె తలకు మాత్రమే ఉపయోగిస్తారన్న సంగతి అందరికీ తెలుసు. దాన్ని వంటలలో ఉపయోగిస్తే శరీరంలో కొవ్వు తగ్గుతుందనీ, అధికబరువును తేలికగా తగ్గించుకోవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇది నిజం కాదంటున్నారు హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ నూనె జుత్తు వరకూ మంచిదే కానీ, ఆహారంతో కలిపి తీసుకుంటే కడుపులోకి వెళ్ళిన తరువాత అది విషతుల్యంగా మారుతుందని వారు చెబుతున్నారు. కొబ్బరినూనె కారణంగా శరీరంలో కొలస్ట్రాల్‌ ఒక్కసారిగా పెరిగిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. కొబ్బరినూనె తాగడం అనేది చాలా ప్రమాదకరం అని బ్రిటన్‌కు చెందిన హార్ట్ ఫౌండేషన్ సీనియర్ డైటీషియన్‌ హెచ్చరిస్తున్నారు. ఏదిఏమైనా వైద్యుల సలహా లేకుండా కొబ్బరినూనెను ఆహారపదార్థాల తయారీలో ఉపయోగించకూడదని వారు సూచిస్తున్నారు.