శాకాహారంతో అదుపులో కొలెస్ట్రాల్‌

24-08-2017: శాకాహారంతో శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు అదుపులో ఉండి హృద్రోగ సంబంధ వ్యాధులు, గుండెపోటు ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. మొక్క ఆధారిత ఆహారంతో బరువు, రక్తపోటు తగ్గుతుందని అమెరికాలోని ఫిజీషియన్స్‌ కమిటీ ఫర్‌ రెస్పాన్సిబుల్‌ మెడిసిన్‌ పరిశోధకులు తెలిపారు. శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గి హృదయనాళ వ్యవస్థ సరిగా పనిచేస్తుందని, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తింటే ఆరోగ్యానికి మంచిదని సూచించారు.