తల్లిని బట్టే పిల్లలకు దీర్ఘాయువు

18-08-2018: కేన్సర్‌, మధుమేహం, గుండె జబ్బుల వంటి రోగాలేమీ లేకుండా 90 ఏళ్లకు పైబడి బతికిన మహిళల.. ఆడ సంతానం కూడా ఎక్కువ కాలమే జీవిస్తారని ఒక పరిశోధనలో వెల్లడైంది. తల్లిదండ్రులిద్దరూ 90 ఏళ్లు బతికితే వారి ఆడ సంతానానికీ దీర్ఘాయువు ఉంటుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో సుమారు 22 వేల మంది మహిళలపై వారు అధ్యయనం చేశారు.