ఛాతీ నొప్పి మందులతో గుండెపోటు ముప్పు!

19-03-2019: ఛాతీ నొప్పి, హై బీపీకి సాధారణంగా వినియోగించే మందుల వలన అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని నెదర్లాండ్స్‌లోని అకడమిక్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా గొంతునొప్పి, ఛాతినొప్పి, బీపీకి విరివిగా వాడే నిఫెడోపిన్‌, అల్మోడిపిన్‌, డిహైడ్రోపిరిడిన్స్‌ వంటి మందుల ప్రభావాన్ని వారు పరిశీలించారు. నిఫెడిపిన్‌, అమ్లోడిపిన్‌ను హై డోస్‌ (60 ఎంజీ) వాడుతున్న వారికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు వారు గుర్తించారు.