సువాసనతో స్మోకింగ్‌కు చెక్‌!

20-04-2019: ఆహ్లాదకర సువాసనతో సిగరెట్‌ ఆలోచనను దూరం చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అబ్‌నార్మల్‌ సైకాలజీ అనే జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురించారు. ధూమపానం మానేయాలన్న ఆలోచన లేని 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న 232 మందిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వారికి చాకొలేట్‌, ఆపిల్‌, వెనిల్లా వంటి ఆహ్లాదకర సువాసనలు పీల్చుకునే అవకాశం కల్పించారు. ఆ సమయంలో వారికి సిగరెట్‌ తాగాలన్న కోరిక తగ్గుముఖం పట్టినట్టు గుర్తించారు.