బిర్యానీ ఆకుతో దోమల బెడదకు చెక్‌!

05-09-2018: వర్షాకాలం అంటే రోగాల సీజన్. అందునా ఈ కాలంలో దోమలు విజృంభిస్తాయి. ఈ దోమల నివారణకు ఓ ఆకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ కాలంలో ఎక్కువగా వ‌చ్చే దోమ‌లు, ఈగ‌లు, పురుగులు బిర్యానీ ఆకు కాలిస్తే వచ్చే పొగ వల్ల పారిపోతాయి. రెండు లేదా మూడు బిర్యానీ ఆకుల‌ను తీసుకుని ఒక గ‌దిలో కాల్చినప్పుడు పొగ వ‌స్తుంది. ఈ స‌మ‌యంలో గ‌ది నుంచి బ‌య‌టికి వెళ్లి త‌లుపులు పెట్టేయాలి. అలా ఒక 10 నిమిషాల పాటు అలాగే త‌లుపుల‌ను బంధించి ఉంచాలి. దీంతో ఆ పొగ అంతా రూమ్‌లో వ్యాపిస్తుంది. అనంత‌రం రూమ్‌లోకి వెళ్లి ఆ పొగ‌ ఆ వాస‌న‌ను పీల్చాలి. దీంతో మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి,ఆందోళ‌న అంతా మటుమాయం అయిపోతాయి. దోమలు కూడా ఈ పొగకి గదిలోనుంచి పారిపోతాయి. ఈ సంగతి ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది!