తాజా చేపలతో ఆస్తమాకు చెక్‌!

21-03-2019: చేపలు మంచి పౌష్టికాహారం అని అందరికీ తెలిసిందే. ఆహారంలో తాజా చేపలు తీసుకుంటే ఆస్తమా (ఉబ్బసం) రాకుండా నిరోధిస్తాయని ఆస్ర్టేలియాలోని జేమ్స్‌ కుక్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలోని ఓ చేపల ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలో పనిచేసే 600 మందిపై పరిశోధనలు చేసిన అనంతరం వారు ఈ విషయాన్ని గుర్తించారు. మారుతున్న ఆహారపు అలవాట్ల వలన ప్రజలు ఫాస్ట్‌ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌కి అలవాటు పడిపోయారని ఆయన అన్నారు. సముద్రపు చేపల్లో ఉండే ఎన్‌-3 అనే పదార్థం ఆస్తమా వచ్చే ప్రమాదాన్ని 62 శాతం తగ్గిస్తుందని లొపాటా తెలిపారు. వెజిటెబుల్‌ ఆయిల్స్‌లో అధికంగా లభించే ఎన్‌-6 వలన ఆస్తమా వచ్చే ప్రమాదం 67 శాతం అధికమని ఆయన హెచ్చరించారు.