ఫైబర్‌ రైస్‌తో షుగర్‌వ్యాధికి చెక్‌!

25-04-2019: పాలిష్‌ చేసిన బియ్యా (వైట్‌ రైస్‌)నికి స్వస్తిచెప్పి.. పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్‌ తీసుకుంటే మధుమేహం, బ్లడ్‌ షుగర్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని మద్రాస్‌ డయాబెటిస్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. వైట్‌ రైస్‌ వాడకం వలన టైప్‌-2 మధుమేహం వస్తుంది. ఆపై కళ్లు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత వంటి ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఫైబర్‌ ఎక్కువగా లభించే పదార్థాలు ఆహారంగా తీసుకుంటే బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. అందుకే వైట్‌ రైస్‌ స్థానంలో హై ఫైబర్‌ రైస్‌ను తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక బరువు సమస్యకూ ఇది చక్కని పరిష్కారమని తెలిపారు.