నీలి కాంతితో రక్తపోటుకు చెక్‌!

11-11-2018: నీలి కాంతి శరీరంపై పడితే రక్తపోటు తగ్గి గుండె సంబంధ రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చునని తాజా సర్వేలో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్‌ సర్రే(బ్రిటన్‌), హెన్రిచ్‌ హీనే యూనివర్సిటీ(జర్మనీ) పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. కొంతమందిని ఎంపిక చేసి వారి శరీరంపై నీలి కాంతి కనీసం 30 నిమిషాలు పడేట్లు చేయగా.. వారిలో సిస్టోలిక్‌ రక్తపోటు 8ఎంఎంహెచ్‌జీ తగ్గినట్లు గుర్తించారు. రక్తపోటు తగ్గడానికి మందులు తీసుకొన్నవారిలోనూ ఇదే విధమైన ఉపశమనం కలుగుతోంది.