ఆరెంజ్‌తో కంటి జబ్బులకు చెక్‌

14-07-2018: నారింజ (ఆరెంజ్‌) కాయలు ఎక్కువగా తింటే కంటి జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. భారత సంతతికి చెందిన బామిని గోపీనాథ్‌ ఆధ్వర్యంలో ఆస్ర్టేలియాలోని వెస్ట్‌మీడ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ పరిశోధకులు 15 ఏళ్లపాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు. క్రమం తప్పకుండా ఒక ఆరెంజ్‌ తిన్న వారిలో కంటి సమస్యలు వచ్చే అవకాశం 60% తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. నారింజలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ కంటి జబ్బులు రాకుండా నిరోధిస్తాయని తెలిపారు.