బూటు సోల్‌తో మధుమేహ గాయాలకు చెక్‌

19-11-2018: మధుమేహంతో బాధపడేవారికి గాయాలైతే త్వరగా నయం కావు. వీరి కోసం ప్రత్యేకమైన బూటు సోల్‌ను తయారు చేశారు అమెరికాలోని పుర్డీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మధుమేహ బాధితుల పాదాలకున్న గాయాలను త్వరగా నయం చేసేందుకు ఇది దోహద పడుతుందని తెలిపారు. తాము రూపొందించిన సోల్‌ నిరంతరం ఆక్సిజన్‌ను అందించడం వలన సౌకర్యవంతంగా ఉండి గాయాలు త్వరగా మానిపోతాయని పరిశోధకులు తెలిపారు.