కృత్రిమ ప్రతిరక్షకాలతో ఎబోలాకు చెక్‌

16-11-2018: ఆ మధ్య ఎబోలా వైరస్‌ పేరు చెబితే ప్రపంచదేశాలు వణికిపోయాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో వేల సంఖ్యలో జనం చనిపోయారు. ఇప్పటికీ ఎబోలాకు చికిత్స లేదా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. అయితే విస్టార్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఎబోలా నుంచి కాపాడే కృత్రిమ ప్రతిరక్షకాలను అభివృద్ధి చేశారు. వీటికి డీఎన్‌ఏ-ఎన్‌కోడెడ్‌ మోనోక్లోనాల్‌ యాంటీబాడీస్(డీఎంఏబ్స్‌)గా పేరు పెట్టినట్లు సెల్‌ రిపోర్ట్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఎలుకలపై వీటితో పరీక్షలు చేసి ఆశించిన ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఎబోలా నుంచి డీఎంఏబ్స్‌ పూర్తి రక్షణ కల్పిస్తాయని విశ్వస్తున్నారు.