గంట వ్యాయామం చేస్తే సెంచరీ ఖాయం!

06-02-2019: ఇదేదో స్లోగన్‌ అనుకుంటే పప్పులో కాలేసినట్టే! సుమారు 22 సంవత్సరాల పాటు ఎనిమిదివేల మంది స్త్రీ పురుషుల మీద చేసిన అధ్యయనం తేల్చిన నిఖార్సయిన నిజం. ముఖ్యంగా స్త్రీలు ప్రతి రోజూ గంటపాటు వ్యాయామం చేసినట్టయితే వారు 80నుంచి 90 సంవత్సరాలు జీవించే అవకాశముందని అధ్యయనకారులంటున్నారు. పురుషులు గంట అంతకు మించి వ్యాయామం చేస్తే నూరేళ్ళు జీవించడం ఖాయం అని స్పష్టం చేస్తున్నారు. స్త్రీ పురుషులిద్దరూ సమానంగా వ్యాయామం చేసినా, వారు జీవించే విషయంలో ఈ వ్యత్యాసం ఎందుకు ఉందో వారు చెప్పలేకపోయారు. బహుశా మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం, తద్వారా సంక్రమించే ఆరోగ్య సమస్యలు వారి జీవిత కాలాన్ని తగ్గించేస్తూ ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.