150 ఏళ్లనాటి మందుతో కేన్సర్‌ చికిత్స!

20-10-2018: ఎప్పుడో 150 ఏళ్ల క్రితం కనుగొన్న ఔషధం.. రేడియేషన్‌ థెరపీలో కేన్సర్‌ కణాలపై మరింత ఎక్కువ ప్రభావం చూపుతుందని అమెరికాలోని ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. పపావెరిన్‌ అని పిలిచే ఈ మందు మైటోకాండ్రియా శ్వాసక్రియను, శక్తిని తయారు చేసే భాగాలను, కేన్సర్‌ కణితులను సున్నిత పరుస్తుందని పరిశోధకులు తెలిపారు.