అబ్బబ్బా ముద్దు!

ఆంధ్రజ్యోతి, 06-03-2017: ముత్యమంతా ముద్దు చిట్టి ముద్ర వేస్తుంది. అధరాల చుంబనం మాత్రం ప్రేమ గాఢతను తెలియజేయడంతో పాటు, ఆరోగ్యాన్నీ పెంచుతుందట. రసికత పాళ్లు కాస్త అధికంగా ఉన్నవాళ్లు ఇంచు ఇంచు ముద్దులు కాకుండా.. ఇంగిలీషు ముద్దులతోనే జీవితకాలంలో ఇంచుమించు పదిహేను రోజులు గడిపేస్తారట. ఫ్రెంచ్‌ కిస్‌తో ఒక నిమిషం పాటు గడిపితే, ఆ ముద్దు ఇచ్చుకున్న వారిద్దరిలో 26 కేలరీల చొప్పున చప్పున కరిగిపోతాయని లెక్కకట్టారు సర్వేకారులు. ఒక గంటపాటు జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తే ఎన్ని కేలరీలు కరుగుతాయో, ఒక గంట లిప్‌లాక్‌ కూడా అన్నే కేలరీలను కరిగిస్తుందని తేల్చారు. అయితే ఇలా హాట్‌ హాట్‌గా ముద్దులు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు నోటిలో ఉండే 278 రకాల బ్యాక్టీరియాలు ఒకరి నుంచి మరొకరికి చేరుతాయని వారు పేర్కొన్నారు.