మెదడు పరిమాణం, మందంతో మూర్ఛ రోగం అంచనా

23-01-2018: మెదడులోని బూడిదరంగు ప్రాంతాల(గ్రే మ్యాటర్‌) పరిమాణం, మందం తేడాను బట్టి మూర్ఛ రోగం వచ్చే ప్రమాదం ఉందా? లేదా? అన్నది గుర్తించవచ్చని యూకేలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఈ తేడాల వల్ల మెదడు పనితీరుకు ఆటంకం కలిగే అవకాశాలపై, ఎదురయ్యే సమస్యలపై అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధకుల బృందంలోని భారత సంతతి శాస్త్రవేత్త సంజయ్‌ సిసోడియా తెలిపారు. ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియాల్లో 2,149 మంది మూర్ఛ రోగుల మెదళ్లను పరీక్షించగా వారి గ్రే మ్యాటర్‌ పరిమాణం, మందంలో తేడాలున్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 06-1.5 శాతం మంది మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారు.