లేటుగా నిద్రపోతే మెదడు పనిచేయదు

20-03-2019: పని లేదా ఇతర కారణాలతో చాలామంది రాత్రి సమయంలో ఆలస్యంగా పడుకుంటుంటారు. ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలనీ, రోజూ ఆలస్యంగా నిద్రపోయేవారికి మెదడు పనిచేయదని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చాలామందికి ఆఫీసుల నుంచి వచ్చి టీవీ, వీడియోస్, గేమ్స్, చాటింగ్ చేస్తూ లేటుగా నిద్రపోవడం అలవాటు. దీని కారణంగా లేటుగానే లేస్తారు. ఈ అలవాట్లు మంచిది కాదని అందరికీ తెలిసినా పెద్దగా పట్టించుకోరు. కానీ, ఈ అలవాటు వారికి హాని చేస్తుందంటున్నారు పరిశోధకులు. నిద్రపోయి, లేచే టైమ్‌ని మార్చకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారురన్న విషయం యూకెలో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. రోజూ ఆలస్యంగా నిద్రించేవారు మరుసటి రోజు అంత చురుకుగా ఉండకపోవడానికి కారణం వారి మెదడు పనితీరేనని వారు స్పష్టం చేస్తున్నారు.