వ్యాయామం కంటే పోషకాహారంతోనే ఎముకల పటుత్వం!

18-10-2018: వ్యాయామం కంటే సరైన పోషకాహారమే ఎముకల ద్రుఢత్వానికి ఎక్కువ దోహదపడుతుందని అమెరికాలోని మిషిగాన్‌ వర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. ఎముకలపై ప్రయోగాత్మకంగా చేసిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. ఎలుకలకు వ్యాయామ శిక్షణ నిలిపివేసిన తర్వాత కూడా వాటికి పోషక విలువలున్న ఆహారాన్ని అందించడంతో అవి ఎముకల్లో బలాన్ని నిలబెట్టుకునాయని మిషిగాన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ డేవిడ్‌ కోన్‌ వెల్లడించారు.