డైట్‌ను గుర్తించే రక్తపరీక్ష

21-06-2018: ఒకే ఒక రక్త పరీక్ష ద్వారా ఈ రోజుల్లో జబ్బులేమిటో చెప్పేస్తున్నారు. ఒక్క రోగాలే కాదు.. డాక్టర్‌ చెప్పినట్టుగా రోగి తింటున్నాడో లేడో కూడా గుర్తించొచ్చని అంటున్నారు జాన్స్‌ హోపికిన్స్‌ బ్లూంబర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు. ‘డాష్‌’ డైట్‌ తీసుకోవాల్సిన 329 మందిపై ఈ పరీక్షలు చేయగా.. వారిలో 97 మంది సరిగా ఫుడ్‌ తీసుకోవడం లేదని తేలింది. 67మంది అయితే పండ్లూ, కూరగాయలు కాస్త ఎక్కువగానే తింటున్నట్లు గుర్తించారు.