ధూమపానంతో అంధత్వం

19-02-2019: విచ్చలవిడిగా ధూమపానం చేస్తే అంధత్వం వచ్చే ప్రమాదం ఉందట. రోజుకు 20 కంటే ఎక్కువ సిగరెట్లు తాగేవారి కంటి రెటీనాలోని రక్తనాళాలు, న్యూరాన్లు దెబ్బతింటాయని తద్వారా కంటి చూపు మందగిస్తుందని, అది చివరికి చూపు కోల్పోయే అవకాశం ఉందని అమెరికాలోని రట్జర్స్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొంత మంది 25 నుంచి 45 ఏళ్ల వయసున్న వ్యక్తులను పరిశీలించగా ధూమపానం ఎక్కువగా చేసేవారిలో కంటి రక్తనాళాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు తేలిందని పేర్కొన్నారు.