కడుపులో రక్తస్రావం కనిపెట్టే సెన్సర్‌

26-05-2018: కడుపులో రక్తస్రావం అవుతున్నా.. జీర్ణాశయ వ్యవస్థ దెబ్బతిన్నా రియల్‌ టైమ్‌లో కనిపెట్టే సెన్సర్‌ను మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ మేరకు పందులపై చేసిన పరిశోధనలు సత్ఫలి తాలు ఇచ్చినట్లు ఎంఐటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ టిమోతీలు తెలిపారు. ఈ సెన్సర్‌ నెలన్నరపాటు నిరంతరాయంగా పనిచేస్తూ కడుపులో చోటుచేసుకొనే మార్పులను గమనించి రియల్‌ టైమ్‌లో వివరాలు అందజేసింది. అయితే దీనిని మనుషులపై పరీ క్షించేదుకు సమయం పట్టొచ్చని అంటున్నారు.