బ్రెడ్డుతో జాగ్రత్త!

03-10-2018: ఉదయం సమయంలో బ్రేక్‌ఫాస్ట్‌ కింద బ్రెడ్డు తినడం చాలా మందికి అలవాటు. ఇది మంచిది కాదంటున్నారు పరిశోధకులు. ఆధునిక ఆహారశైలి కారణంగా ఉదర సంబంధ సమస్యలతోపాటు డిప్రెషన్‌ లాంటి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్రెడ్‌, పాస్తాలాంటివి ఎక్కువగా తీసుకునే వారిలో మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయంటున్నారు వారు. దీనికి కారణం బ్రెడ్డులో గ్లూటెన్‌ అని వారు స్పష్టం చేస్తున్నారు. ఇది మెదడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వారు చెబుతున్నారు. అయితే ఇది అందరి విషయంలో జరగకపోవచ్చని కొందరి మీద మాత్రం దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. బ్రెడ్‌ తిన్న తరువాత పళ్ళు తీసుకుంటే కొంత వరకూ సమస్య నుంచి తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.