తమలపాకులతో తస్మాత్‌ జాగ్రత్త!

16-05-2018: భోజనం తరువాత తమలపాకు వేసుకోవడం చాలామందికి అలవాటు. దీనిని మితంగా తీసుకున్నంత వరకూ ఎలాంటి సమస్యలు రావనీ, రోజుకి పది లేదా అంతకుమించి తీసుకునేవారిలో ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమలపాకు తొడిమతో సహా తీసుకునేవారిలో సంతానోత్పత్తి తగ్గే అవకాశాలు ఎక్కువన్న విషయం ఇటీవల చేసిన అధ్యయనాలలో తేలింది. దీన్ని పొగాకుతో కలిపి తీసుకుంటే నోటికేన్సర్‌ వచ్చే అవకాశం 80శాతం వరకుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా రోజుకి ఐదారుసార్లు తమలపాకు వేసుకునేవారికి అది భయంకరమైన అలవాటుగా మారుతుందనీ, ఆ తరువాత దీన్ని మానుకోవాలన్నా మానుకోలేరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే దీన్ని ఒకటి లేదా రెండుసార్లకి మించి తీసుకోరాదని వారు హెచ్చరిస్తున్నారు.