బాల్‌ గేమ్స్‌ ఎముకలకు భేష్‌

10-02-2018: మీ పిల్లలు ప్రతి రోజు వ్యాయామం చేస్తున్నారా? చేయకుంటే కనీసం వారానికి రెండు గంటలపాటు బాల్‌గేమ్స్‌ ఆడించండి. దీని వల్ల పిల్లల్లో ఎముకలు బలంగా తయారవుతాయని పరిశోధనలో తేలింది. 8 నుంచి 10ఏళ్ల వయసున్న పిల్లలు సాధారణ వ్యాయామంతో పోలిస్తే వారంలో 2 గంటలపాటు ఫుట్‌బాల్‌, టెన్నిస్‌, బేస్‌బాల్‌, క్రికెట్‌ వంటి ఆటలు ఆడితే భవిష్యత్‌లో ఆస్టియోపోరోసిస్‌ రాకుండా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. డెన్మార్క్‌లోని 270 మంది విద్యార్థులపై ఏడాది పాటు పరిశోధన జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు.