క్రంచెస్‌తో వెన్ను వంకర

22-01-2018: పొత్తి కడుపులో పేరుకొన్న కొవ్వు తగ్గాలంటే క్రంచెస్‌ని మించిన వ్యాయామం లేదని అనుకుంటాం. కానీ క్విన్సీ కాలేజ్‌ ప్రొఫెసర్‌ వెయిన్‌ వెస్ట్‌కాస్‌, క్రంచెస్‌ చేయటం వల్ల పొత్తికడుపులోని కండరాల పటుత్వం పెరుగుతుంది తప్ప కొవ్వు కరగదని అంటున్నారు. పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్శిటీలో చేసిన పరిశోధన ఆధారంగా భుజాలు, పిరుదులు, నడుము కింది భాగం మీద ఒత్తిడి పడినా కొవ్వు కరిగించేంత ప్రభావం మాత్రం ఉండదట! క్రంచెస్‌ కంటే ప్లాంక్స్‌, బ్రిడ్జెస్‌ చేయటం వల్ల ఫలితం ఉంటుందని పరిశోధనలో తేలింది. కోర్‌ ఎక్సర్‌సైజ్‌గా క్రంచెస్‌ని ఉపయోగించాలనుకుంటే సరైన భంగిమను అనుసరించాలనీ, లేదంటే వెన్ను వంకర తిరిగి నొప్పి మొదలయ్యే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.