బీపీ తెలియాలంటే మూడు సార్లు పరీక్షించాల్సిందే

16-04-2019: రక్తపోటు.. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఒకటి. చాలా సమయాల్లో వైద్యులు ఒక్కసారే పరీక్ష చేసి రక్తపోటును నిర్ధారిస్తుంటారు. కానీ కచ్చితమైన బీపీ తెలియాలంటే ఒక్కసారి పరీక్షిస్తే సరిపోదంట. వేర్వేరు సమయాల్లో కనీసం మూడు సార్లు చెక్‌ చేసినప్పుడే సరైన ఫలితాలు తెలుసుకోవచ్చని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ పరిశోధకులు చెబుతున్నారు.