కేన్సర్‌ కణాలను అంతం చేసే.. బీజీబీపీ

28-09-2019: ఏ మందులకూ, చికిత్సకూ లొంగని కేన్సర్‌కు.. మానవ వ్యాధి నిరోధక వ్యవస్థ నుంచి ఉత్పత్తి అయ్యే బీటా గెలాక్టోసైడ్‌ బైండింగ్‌ ప్రొ టీన్‌(బీజీబీపీ) అణువుతో చెక్‌ పెట్టొచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యాధి నిరోధక కణాల్లో ఉండే బీజీబీపీ అణువులను ఓ క్రమ పద్ధతిలో ఉద్దీపన చేస్తే, అవి నేరుగా కేన్సర్‌ కణాలను ఎదుర్కొని అంతం చేస్తాయని తమ అధ్యయనంలో తేలిందన్నారు. కీమోథెరపీ సహా ఇతరత్రా కేన్సర్‌ చికిత్సా విధానాలు ఆశించిన ఫలితాలు ఇవ్వని ప్రస్తుత పరిస్థితుల్లో బీజీబీపీ థెరపీ ఆశాదీపంలా మారనుందన్నారు.