రక్త పరీక్షలతో ఆటిజం గుర్తింపు

20-02-2018: చిన్న పిల్లల్లో ఎక్కువగా ఆటిజం(మూగవ్యాధి) కనిపిస్తుంటుంది. ఈ సమస్యతో బాధపడే పిల్లలు తోటివారితో పెద్దగా కలవలేరు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, రక్తంలోని ప్లాస్మాలో గల ప్రోటీన్ల నష్టానికి ఈ ఆటిజంతో సంబంధం ఉన్నట్లు తాజాగా యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ వార్‌విక్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిద్వారా ముందుగానే ఆటిజంను కనుగొనే కొత్త రకం రక్త పరీక్షలను కనిపెట్టారు.