హార్మోన్ల మార్పుతో స్త్రీలకు ఆస్తమా

18-02-2018: మహిళల సెక్స్‌ హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల అలర్జీలు, ఆస్తమా పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రజస్వల అయినపుడు గానీ, మెనోపాజ్‌ దశలో గానీ హార్మోన్ల ప్రభావంతో ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయని వెల్లడించారు. దాదాపు 5లక్షల మంది స్త్రీలపై పరిశోధనలు చేశామని వివరించారు. అయితే, హార్మోన్ల మార్పు వల్ల ఆస్తమా, అలర్జీలు రావడానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు.