వాయు కాలుష్యంతో లక్షల మంది చిన్నారుల్లో ఆస్తమా

13-04-2019: ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి వాయు కాలుష్యం. దీని కారణంగా చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే, 2015లో వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో 3.50లక్షల మంది చిన్నారులు ఆస్తమా బారిన పడినట్లు లాన్‌సెట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. అదే చైనాలో 7.60లక్షల మంది పిల్లలు ఆస్తమా బారిన పడ్డారు. 194 దేశాలు, 125 ప్రధాన నగరాల్లోని వాతావరణ కాలుష్యాన్ని అమెరికాలోని జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు.