రొమ్ము కేన్సర్‌ కణతులను గుర్తించే కృత్రిమ మేధస్సు!

18-10-2017: రొమ్ముల్లో ఏర్పడే కణతుల్లో కేన్సర్‌ కారక కణుతులను గుర్తించే కృత్రిమ మేధస్సును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేన్సర్‌కు దారితీసే కణతులను కచ్చితంగా గుర్తించే ఒక యంత్రాన్ని అభి వృద్ధి చేశామని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్లు తెలిపారు. ఈ యంత్రం గుర్తించిన 38 కణతుల్లో, 37 కణతులు కేన్సర్‌గా పరిణామం చెందాయని పరిశోధకులు తెలిపారు. అధికశాతం అండాశయ కేన్సర్లు ఫాలోపియన్‌ నాళాల్లో పురుడుపోసుకుంటున్నాయని మరో ప్రయోగంలో శాస్త్రవేత్తలు గుర్తించారు.