కృత్రిమ తీపి పదార్థాలతో ముప్పు!

లండన్‌, జనవరి 3: కృత్రిమ తీపి (ఆర్టిఫిషియల్‌ స్వీటనర్స్‌) వల్ల మంచికన్నా చెడే ఎక్కువగా ఉందని ది బీఎంజే అనే జర్నల్‌లో ప్రచురితమైన 50 పరిశోధక పత్రాలు హెచ్చరిస్తున్నాయి. ఆరోగ్యానికి మంచి జరిగినట్లు ఎక్కడా గుర్తించలేదని, కానీ దుష్పరిణామాలు వెలుగు చూస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్రీబర్గ్‌(జర్మనీ) పరిశోధకులు తెలిపారు. ‘నో షుగర్‌’ లేదా ‘షుగర్‌ ఫ్రీ’ వంటివి ఈ కేటగిరీలోనివే.