ప్రాసెస్‌డ్‌ ఆహారం తింటున్నారా?

19-06-2019: అయితే హార్టెటాక్‌, హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు పరిశోధకులు. ఇటీవల జరిపిన ఓ ఫ్రెంచ్‌ అధ్యయనం ప్రకారం రోజువారీ ఆహారంలో అల్ట్రా–ప్రాసెస్‌డ్‌ ఆహారం 10 శాతం తీసుకుంటున్నవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం 12 శాతం ఉందట. అలాగే ఇదే విషయంపై జరిపిన ఓ స్పానిష్‌ అధ్యయనంలో గుండెజబ్బులతోపాటు మరణించే అవకాశాలు 18 శాతం ఉన్నాయట. కేన్సర్‌ బారినకూడా పడవచ్చంటున్నారు అధ్యయనకారులు. ఇందుకు కారణం ఆహారాన్ని ప్యాక్‌ చేసే సమయంలో వాడే ప్రిజర్వేటివ్‌లు, స్వీటెనర్స్‌. అంతేకాకుండా ఆహారం పాడవకుండా నిల్వ ఉంచే క్రమంలో కొన్ని రకాల రసాయనాలు తయారై మరణానికి దారితీసే అవకాశం ఉందంటున్నారు వారు. రెడీమేడ్‌ మీల్స్‌, సిరీల్స్‌, స్వీట్‌ డ్రింకులు, చిప్స్‌ వంటివాటిని, ఇంకా ఇతర ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ తీసుకోవద్దని సూచిస్తున్నారు.