రోగానికి కచ్చితమైన మందు!

జన్యు అమరిక గుర్తించే కంప్యూటర్‌ ప్రోగ్రాం రెడీ

21-05-2019: వ్యక్తుల జన్యు అమరికను గుర్తించే కంప్యూటర్‌ ప్రోగ్రాంను శాస్త్రవేత్తలు రూపొందించారు. కచ్చితమైన మెడిసిన్‌ తయారీకి ఈ చర్య దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులన్నింటికంటే మరింత కచ్చితంగా, వేగంగా ఓ వ్యక్తిలోని జన్యు అమరికను కంప్యూటర్‌ ద్వారా స్టెప్పులవారీగా చిత్రీకరించే ఈ ప్రోగ్రాంను ఫ్లే(ఎ్‌ఫఎల్‌వైఈ) అని పిలుస్తున్నారు.

రోగాన్ని మరింత కచ్చితంగా గుర్తించేందుకు, నివారించేందుకు, మెరుగైన చికిత్సకు ఇది దోహదపడుతుందని ఆస్ర్టేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకుడు యూ లిన్‌ పేర్కొన్నారు. ప్రత్యేకించి ప్రస్తుతం చికిత్స లేని రోగాలతో బాధపడుతున్నవారు సహా ప్రజలు దీర్ఘకాలం జీవించేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు. జన్యు లోపాలను గుర్తించే ప్రక్రియను మెరుగుపరచడంతోపాటు, ప్రస్తుతం చికిత్స లేని రోగాలతో బాధపడుతున్నవారికి కచ్చితమైన మందులను కనుగొనేందుకు ఇది మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.