మద్యం మత్తుకు కొత్త మందు

10-02-2018: అమితంగా మద్యం సేవిస్తే మత్తు ఆవహించి మెదడు మొద్దు బారుతుంది. కొందరైతే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఆ సమస్య నుంచి బయటపడేసే కొత్త మందును శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘టాండోస్పైరాన్‌’ అనే ఔషధాన్ని రెండు వారాల పాటు రోజూ తీసుకోవడం వల్ల మెదడు ఉత్తేజితమై, మద్యం వల్ల పాడైన నాడులు తిరిగి పనిచేస్తాయని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. నాడీ జీవకణాలు ఉత్పత్తి చేసే న్యూరోజెనెసి్‌సపై మద్యం వల్ల కలిగే చెడు ప్రభావాన్ని ఈ మందు తగ్గిస్తుందని వెల్లడించారు.