అస్తమా, బీపీ ఔషధాలను గుర్తించే కొత్త పరికరం!

11-02-2018: అస్తమా, రక్తపోటు, కండరాల సమస్యలకు ఔషధాలను వేగంగా గుర్తించేందుకు సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఫ్లీక్స్‌ పేరుతో పిలిచే ఈ పరికరం ద్వారా దెబ్బతిన్న కణాలను పరిశీలించి ఎలాంటి మందులు ఉపయోగించాలో సులువుగా తెలుసుకునే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పోలిస్తే కొత్త పద్ధతి ద్వారా కణాల శక్తిని 100 రెట్ల వేగంగా గుర్తించడంతో పాటు యథాస్థితికి తీసుకు రావచ్చని వర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు తెలిపారు.