గుండెపోటును గుర్తించే సరికొత్త యాప్‌!

13-11-2018: గెండెపోటు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. అయితే... అమెరికాలోని ఇంటర్‌మౌంటెయిన్‌ మెడికల్‌ సెంటర్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ప్రాణాంతక గుండెపోటును ముందుగానే గుర్తించే ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను రూపొందించారు. ఆలివ్‌కోర్‌గా పిలిచే ఈ యాప్‌.. ఈసీజీ అంతటి కచ్చితత్వంతో పనిచేస్తుంది. ఈ యాప్‌ గుండె పనితీరును పర్యవేక్షించి, ధమనుల్లో ఏదైనా అడ్డుపడితే దాన్ని గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనల్లో భాగంగా గుండె నొప్పి వచ్చిన 204 మందికి ఈసీజీ, ఆలివ్‌కోర్‌ యాప్‌ సాయంతో పరీక్షలు నిర్వహించారు.