కొవ్వు పదార్థాలతో.. పిల్లల్లో అల్జీమర్స్‌ దూరం

29-08-2019: గర్భంతో ఉన్నప్పుడు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే.. పుట్టబోయే బిడ్డను అల్జీమర్స్‌ బారి నుంచి కాపాడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దీనిపై అమెరికాలోని స్కాట్‌ రిచర్డ్‌ నార్త్‌ స్టార్‌ ఫౌండేషన్‌ పరిశోధనలు జరిపింది. ఒక మహిళకు ఏ వయసులోనైనా అల్జీమర్స్‌ వస్తే.. ఆమె బిడ్డలకూ అదే వయసులో అల్జీమర్స్‌ వస్తుందని ఫౌండేషన్‌ డైరెక్టర్‌ డోమెనికో ప్రాటికో తెలిపారు. తల్లి నుంచి బిడ్డకు అల్జీమర్స్‌ ఎలా వస్తుందో తెలుసుకునేందుకు చుంచెలుకలపై ప్రయోగం చేశారు. వాటిలో ఒక దానికి గర్భం ధరించినప్పటి నుంచి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఇచ్చి పరీక్షించారు.