బ్రేక్‌ఫాస్ట్‌గా బాదం భేష్‌!

12-09-2018: ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వీలుకాని సందర్భాల్లో బాదంపప్పు తింటే మేలని ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకోసం కొంతమంది విద్యార్థులు తీసుకునే అల్పాహారం మీద సర్వే నిర్వహించారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోని వారు బాదంను స్నాక్‌గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం టిఫిన్‌ బదులుగా బాదంపప్పు తీసుకున్న విద్యార్ధుల బ్లడ్‌షుగర్‌ స్ధాయిలు మెరుగ్గా ఉన్న విషయాన్ని అధ్యయనకారులు గుర్తించారు. బాదంలో ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్‌, విటమిన్‌ ఈ, మెగ్నీషియం ఉంటాయని సంగతి తెలిసిందసే! బాదంతో బీపీ, కొలెస్ర్టాల్‌ నియంత్రణలో ఉండటమే కాకుండా, ఇవి ఆకలిని తగ్గించి బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయి. ఆరోగ్యకర పోషకాలతో కూడిన బాదం అన్ని వయసుల వారికి స్మార్ట్‌ స్నాక్‌గా ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.