మద్యపానం మంచిదే!

09-08-2018: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని, దానికి దూరంగా ఉండాలని వైద్యులు పదే పదే చెబుతుంటారు. కానీ దీనివలన ఓ మంచి కూడా ఉందన్న విషయం ఇటలీలో నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. మద్యపానం చేయడం వలన పురుషులలో సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుందన్న విషయం వీరి పరిశోధనల్లో వెల్లడైంది. మందుకీ మగవారి వీర్యానికీ మధ్య సంబంధం తేల్చేందుకు వీళ్లు 323 మందిని ఎన్నుకొన్నారు. వీళ్లలో 10శాతంమంది మద్యపానం జోలికిపోరు. మరో 30శాతంమంది వారానికి ఆరుపెగ్గులు పుచ్చుకుంటారు. ఇంకో 30శాతంమంది వారానికి పదిపెగ్గుల దాకా పుచ్చుకుంటారు. మిగతావారికి వారంలో ఓ పన్నెండు పెగ్గులు మించి పుచ్చుకునే అలవాటుంది. కొన్ని వారాల అనంతరం వీరిని పరిశీలించగా, వారానికి పదిపెగ్గులదాకా పుచ్చుకునేవారిలో వీర్యం కాస్త ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు తేలింది. అంతేకాదు! వీరిలో వీర్యకణాలు కూడా ఎక్కువగా కనిపించాయి.