గుండెకు ‘వాయు’ గండం

26-06-2019: వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి ప్రాణాంతక గుండెజబ్బులు, మధమేహం వంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుందని లిథువేనియా యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కలుషిత గాలిలో ఎక్కువ సమయం గడిపేవారు, పచ్చదనానికి దూరంగా అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండేవారిలో అధిక రక్తపోటు, జీవక్రియ దెబ్బతినడానికి గల సంబంధాలను వారు పరిశీలించారు. ఇతరులతో పోలిస్తే అలాంటివారి రక్తంలో చక్కెరస్థాయి ఎక్కువై మధుమేహం, ఊబకాయం, హైబీపీ సమస్యలు తలెత్తాయని గుర్తించారు.