టూత్‌ పేస్ట్‌ వాడితే అబార్షన్‌?

05-12-2018: ఇది కొద్దిగా వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కంపెనీ టూత్ పేస్టుతో బ్రష్ చేసుకుంటారు. కానీ మనం రోజు ఉపయోగించే ఈ టూత్ పేస్ట్ ఎంత మేర హాని చేస్తుందన్న విషయం ఎవరికీ తెలియదు. మనం వాడే టూత్ పేస్టు కారణంగా మహిళల్లో అబార్షన్‌లు జరిగే అవకాశం ఉందట. అంతేకాదు.. కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు అంటున్నారు నిపుణులు. కేవలం టూత్ పేస్టులే కాకుండా కొన్ని రకాల సోప్స్ కూడా కేన్సర్ రావడానికి కారణమౌతాయంటున్నారు నిపుణులు. వీటిల్లో ఉండే ట్రైక్లోసన్ అనే పదార్థం  చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ట్రైక్లోసన్ పదార్థం కొద్దికొద్దిగా కడుపులోకి వెళ్లి.. మన శరీరంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కూడా అంతమొందిస్తోంది. తద్వారా ఈ సమస్యలు తలెత్తున్నాయని నిపుణుల వాదన. టూత్‌పేస్ట్‌లు, సబ్బులు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.