కేన్సర్‌ను ముందే గుర్తించే ‘ఏఐ’ రక్త పరీక్ష!

16-11-2018: కేన్సర్‌ను ముందుగానే రక్త పరీక్ష ద్వారా గుర్తించే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ వివరాలను నేచర్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. కేన్సర్‌ లక్షణాలను ఈ విధానంలో ముందుగానే కనిపెట్టవచ్చునని వర్సిటీ హెల్త్‌ నెటవర్క్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్తపరీక్షలో కేన్సర్‌ గురించి తెలుసుకోవడమే కాకుండా అది ఏ రకమో కూడా గుర్తిస్తుంది. ఈ మేరకు కొందరిపై చేసిన పరిశోధన ఫలితాలు, ముం దుగా సేకరించిన డేటాతో సరిపోలినట్లు తెలిపారు.