నెలలు నిండని బేబీలకు సంతానలేమి ముప్పు!

16-07-2019: నెలలు నిండకుండానే పుట్టే చిన్నారులు (ప్రీ మెచ్యూర్‌ బేబీ) పెద్దయిన తర్వాత మాతృత్వపు అనుభూతులను ఆస్వాదించే అవకాశం తక్కువని, వారిలో శృంగార భావనలు కూడా తక్కువ స్థాయిలో ఉంటాయని బ్రిటన్‌లోని వార్విక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా వారు 44 లక్షల మంది పెద్దల డేటాను వారు పరిశీలించారు. 37 వారాల్లోపే జన్మించిన వారికి పెద్దయిన తర్వాత పిల్లలు కలిగే అవకాశాలు 22 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించామని పరిశోధకులు పేర్కొన్నారు.