పేను కొరుకుడు వ్యాధి నివారణకు...

ఆంధ్రజ్యోతి, 25-04-2017: శిరోజ సంపద తలకు నిజంగా పెట్టని కిరీటం వంటిది. కానీ పేనుకొరుకుడు వ్యాధి ఆ కిరీటాన్ని ముక్కచెక్కలు చేస్తుంది. వెంట్రుకలు బిల్లలు బ్లిలుగా ఊడిపోతూ తలంతా వికృతంగా మారుతుంది ఇది తీవ్రమైన ఆత్మన్యూనతా భావనకు కూడా గురిచేస్తుంది. ఈ సమస్యతో వెంట్రుకలు మొత్తంగా కాకుండా అక్కడక్కడ పోతుంటాయి. దీనివల్ల బట్టతల భాగాలు భాగాలుగా వచ్చినట్లు అనిపిస్తుంది. అసలు వైద్యమే లేదనుకుని చాలా మంది ఆ వ్యాధి ఇంకా ఇంకా పెద్దదయ్యేదాకా నిర్లక్ష్యంగా ఉండిపోతారు. వాస్తవానికి ఈ సమస్యకు పలు రకాల విరుగుడు మార్గాలు ఉన్నాయి.

చందన తైలాన్ని ప్రతిరోజూ మూడు పూటలావెంట్రుకలు ఊడిపోయిన చోట రాస్తూ ఉంటే ఆ భాగంలో వెంట్రుకలు మళ్లీ మొలిచే అవకాశం ఉంది.
గురువింద గింజను నీటిలో అరగదీసి. అలా వచ్చిన గంధాన్ని వెంట్రుకలు ఊడిన ఖాళీ స్థలంలో రాస్తే సమస్య తొలగిపోతుంది.
వెంట్రుకలు ఊడిపోయిన చోట మందార పువ్వుతో రోజుకు రెండు మూడు సార్లు రుద్దితే వెంట్రుకలు మళ్లీ మొలిచే అవకాశం ఉంది.