చుండ్రును తగ్గించాలంటే..

ఆంధ్రజ్యోతి, 05-05-2017: రోజువారి ఒత్తిడిలు, నీటివల్ల.. ఇలా పలుకారణాలతో తలలో చుండ్రు వస్తుంది. ఈ చుండ్రుతో మానసికంగా కూడా బాధపడేవారు కొందరుంటారు. చుండ్రు సమస్యను చిన్న చిన్న చిట్కాలతోనే పరిష్కరించవచ్చు.

 
ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను కొంత చిన్న బౌల్‌లో తీసుకుని దానిలోని పుదీనా ఆకుల రసాన్ని వేయాలి. బాగా మిక్స్‌ చేసి జుట్టుకు పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.
 
జుట్టుకు వెనిగర్‌ను బాగా పట్టించి ఇరవై నిమిషాల తర్వాత జుట్టును చల్లని నీటితో కడిగేయాలి. అరగంట తర్వాత పెరుగును తలకు మాస్క్‌లాగా అప్లై చేసుకోవాలి. కాసేపయ్యాక తలస్నానం చేయాలి.
 
మెంతి ఆకులను మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. అందులో ఓ కప్పు ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ ను వేసి మిశ్రమంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్‌ చేయాలి. ఇరవై నిమిషాలు ఆగాక గోరువెచ్చని నీటితో జుట్టును కడిగేసుకోవాలి.
 
ఒక బౌల్‌లో నిమ్మరసం, తేనె తీసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పూయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి.