చుండ్రు నివారణ ఎలా

నా వయసు ఇరవై ఐదు. గత కొద్ది రోజులుగా చుండ్రుతో బాధపడుతున్నా. అలాగే జుట్టు రాలుతోంది. తరుణోపాయం సూచించగలరు?

- చైతన్య, కర్నూల్‌

చుండ్రు అనేది చర్మ సంబంధ సమస్య. ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. తీపి పదార్థాలు పూర్తిగా మానెయ్యాలి లేదా తగ్గించాలి. డీప్‌ ఫ్రై చేసిన పదార్థాలని తీసుకోకపోవడం మంచిది. వాటికి బదులుగా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, నట్స్‌ తీసుకోండి. ఒమెగా -3 ఫాటీ యాసిడ్లు ఉన్న చేపలు, అవిసె గింజలు తీసుకున్నా ఫలితం ఉంటుంది. వీటన్నిటి వల్లా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్టును సంప్రదించడం శ్రేయస్కరం. జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్లతో పాటు ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు ఉన్న ఆహారం అవసరం. విటమిన్‌ - డి లోపం, నిద్రలేమీ కూడా జుట్టు రాలడానికి కారణమే.