కురులకు పెరుగుతో పరిష్కారం!

23-03-2019: పెరుగులో లభించే మినరల్స్‌, విటమిన్‌ ఇ, జింక్‌ చర్మాన్ని తాజాగా, అందంగా మార్చుతాయి. ముఖానికి ఫేస్‌ప్యాక్‌గా పెరుగు రాసుకుంటే చర్మం మీది మృతకణాలు, నల్లమచ్చలు తొలగిపోతాయి. చర్మం సరికొత్త నిగారింపు పొందుతుంది.
పొడి జుట్టు, చుండ్రు, నిర్జీవమైన కురులు వంటి సమస్యలకు పెరుగుతో పరిష్కారం లభిస్తుంది. పెరుగులోని లాక్టిక్‌ ఆమ్లం మాడుకు అవసరమైన పోషకాలు, మినరల్స్‌ను అందిస్తుంది. ఫలితంగా చుండ్రు తగ్గిపోతుంది. కురులకు పెరుగు చక్కని కండీషనర్‌గా పనిచేసి, వెంట్రుకలను పట్టులా మెరిసేలా చేస్తుంది.
వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పెరుగు సమ్మర్‌ డ్రింక్‌గా పనిచేస్తుంది. పెరుగులో పండ్ల ముక్కలు లేదా అవిసె గింజలు కలుపుకొని తింటే శరీరానికి సరిపడా పీచుపదార్థం లభిస్తుంది.